శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్ చెరు సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మదీనాగూడ ప్రణామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, చైర్మన్ డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, జెరిపేటి జైపాల్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు, శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ, పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా పాశమైలారం ఘటన మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, చనిపోయిన వారి పిల్లల చదువులకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని తెలిపారు.