శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ కాలనీ వాసులు తనదృష్టికి తీసుకువచ్చిన సమస్యలను స్వయంగా కాలనీలో పర్యటించి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తిచేస్తామని తెలిపారు. మంజీర తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని, కాలనీలో దశలవారిగా అన్ని పనులు పూర్తిచేసి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృషి నగర్ కాలనీ అధ్యక్షుడు పద్మనాభన్, ఉపాధ్యక్షుడు పాపిరెడ్డి, సెక్రటరీ వంశీకృష్ణ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, ఆశ్వంత్ కుమార్, ప్రసాద్, మహేశ్వర్, సింగారావు, రాజు, జయ కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






