శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవ రాజు కాటమరాజు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఫిబ్రవరి 12 నుండి 22వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. యాదవరాజు శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు ముగిశాయని, కాటమరాజు జయంతి వేడుకలను అవకాశం ఉన్నంతవరకు ఆ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా చేసే విధంగా ప్లాన్ చేద్దామని అన్నారు. చంద్రవంశ క్షత్రియుడు అయిన కాటమరాజు ఆత్రేయ గోత్రీకుడు అని, శ్రీకృష్ణ పరమాత్మ వంశంవాడని అన్నారు. గోవులు ఆహారం కోసం అల్లాడిపోతుంటే వాటి బాధను తీర్చడానికి జరిగిన యుద్ధంలో నల్ల సిద్ధిరాజుని ఓడించి యుద్ధంలో గెలిచిన వీరుడు కాటమరాజు అని అన్నారు. యాదవ రాజు కాటమరాజు జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా జరిగే విధంగా ప్లాన్ చేయాలని అన్నారు.






