జనప్రియ 5 ఫేజ్‌ కాలనీ లో క‌మ్యూనిటీ హాల్ ను నిర్మించాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ 5 ఫేజ్‌ కాలనీ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.10 లక్షల అంచనా వ్యయంతో SDF FUNDS నిధులతో నిర్మించడానికి గాను నిధుల మంజూరు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరు పత్రాలను సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీ అసోసియేషన్ సభ్యులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే SDF FUNDS నుండి మంజూరు చేయవలసిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదనలు పంపడం జరిగింద‌ని , నిధులు మంజూరు కాగానే కమ్యూనిటీ హాల్ ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, జనప్రియ 5 ఫేజ్‌ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here