శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు లో సివరేజ్ నీరు కలుస్తున్న కారణంగా గుర్రపు డెక్క పెరిగి దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయడంతో కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, అలీ తలాబ్ చెరువులో సివరేజ్ నీరు కలుస్తున్న కారణంగా, గుర్రపు డెక్క పెరిగి దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఈ సమస్యతో దగ్గరి కాలనీల ప్రజల్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ఘటనలు పెరిగాయని అన్నారు. దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, సరస్సులోని గుర్రపు డెక్కను తొలగించి శుభ్రత చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి, కీటక శాస్త్రం సూపర్వైజర్ నరసింహ, సిబ్బంది, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఆల్విన్ వార్డు ఇంజనీరింగ్ ఏఈ యుగంధర్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, శానిటేషన్ డీఈఈ శంకర్ గణేష్, ఏఈఈ బన్సీ పటేల్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఇరిగేషన్ ఏఈ సర్వేశ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






