శేరిలింగంపల్లి, జనవరి 7 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన సంక్షేమ నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని పేర్కొంటూ, బీసీ సబ్ ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ TRP రంగారెడ్డి జిల్లా నాయకులు MRO, RDO, కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

బీసీలకు న్యాయం జరిగే వరకు TRP పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎంఎల్‌సీ తీన్మార్ మల్లన్న, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు, పార్టీ సెంట్రల్ కమిటీ పిలుపు ప్రకారం నిర్వహించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు శంకరుల సురేష్ ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుకి, లలితా రాణి, వనం పద్మ, యాదమ్మ, పొనుగోటి సందీప్, శాగంటి శ్రీనివాస్, ఎండి గౌస్, సంగమ్మ, మంగుబాయ్, రాణి శర్మ, జిల్లా మీడియా ఇంచార్జి ప్రశాంత్ నేత తదితరులు పాల్గొన్నారు.





