శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం సమావేశాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలి అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది అన్నారు. ఇదే స్పూర్తితో రానున్న ఎన్నికల్లో పని చేయాలి అన్నారు. కెసిఆర్ చేసిన అభివృద్ధి తప్పితే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు అన్నారు. శేరిలింగంపల్లిలో మొదటి నుంచి పార్టీ కోసం పని చేసే వారికి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి అన్నారు. కార్యకర్తలు పార్టీకి బలం అని కేటీఆర్ చెప్పారని, అదే స్పూర్తితో ప్రతి ఒక్కరు పని చేయాలి అన్నారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ ల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు అని హర్షం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో బీ ఆర్ ఎస్ పార్టీ బలంగా ఉంది అన్నారు. రానున్న ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని రవీందర్ యాదవ్ తెలిపారు.






