శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అరణ్య నాట్యం గురువు సమతా రావు శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో శ్రీ విజ్ఞ రాజాం భజే, గణేశా కౌతం, పుష్పాంజలి, జతిస్వరం, అర్ధనారీశ్వరం, రామ రామ, శ్రీ హరి స్తోత్రం, భోశంభో, దేవి స్తుతి, కావడి చిందు, హనుమాన్ చాలీసా, శంకర శ్రీగిరి, నర్సింహా కౌతం అంశాలను అడ్వికా, ప్రేరణ, రిషిక, అక్షర, పాలక్, మహేశ్వరి, అద్వైత, శ్రేయశ్రీ, వినుత, శ్రీజిత, అలేఖ్య, యశస్వినీ, ఆరాధ్య, వైష్ణవి, ఖుషి, త్రిశ్విక, చేతన, సంరిద్ది, కవిత తదితరులు ప్రదర్శించి మెప్పించారు.






