క్రీడాకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహకం – క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ – టైక్వాండో క్రీడాకారునికి హోప్ ఫౌండేషన్ చేయూత

నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ, రాష్ట్ర తైక్వాండో క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన చందానగర్ డివిజన్ గంగారంకు చెందిన ముకుల్ సాయి ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆభినందించారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ తో కలిసి క్రీడాకారుడు ముకుల్ సాయి మంత్రి శ్రీనివాడ్ గౌడ్ ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల చిత్తశుద్ధితో ఉందని, క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. క్రీడా రంగంలో క్రీడాకారులు రాణించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండా విజయ్ కుమార్ రూ.20 వేల చెక్కును మంత్రి చేతుల మీదుగా ముకుల్ సాయికి అందచేశారు. ఈ కార్యక్రమంలో కంది జ్ఞానేశ్వర్, రోహిత్ ముదిరాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

టైక్వాండో క్రీడాకారునికి రూ.20వేల చెక్కును అందజేస్తున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here