13 నెలల నీటి బిల్లులు మాఫీ – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డొమెస్టిక్ కేటగిరిలోని నల్లా కనెక్షన్ల వినియోగదారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించిందని ప్రభుత్వ విపద, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇంటి అవసరాల కోసం ఉన్న నల్లా‌‌కనెక్షన్ల దారులకు ఉచిత మంచినీటి పథకంలో భాగంగా 2020 డిసెంబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు 13 నెలలకు సంబంధించిన నీటి బిల్లులను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేయడం జరిగిందని అన్నారు. మురికి వాడలు, డొమెస్టిక్, వ్యక్తిగత, ఎంఎస్ బీఎస్ డొమెస్టిక్‌ బల్క్ కాలనీలలో గల నల్లా నీటి బిల్లులను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత తాగు నీటి పథకం కింద దరఖాస్తు దారుల కస్టమర్ అకౌంట్ నెంబర్ (సిఏఎన్) కు ఆధార్ అనుసంధానం, నల్లా కు మీటర్ ఏర్పాటు, నిర్ణీత ఎత్తు దాటిన భవనాలకు నివాసయోగ్య పత్రం (ఓసి) వాటర్ బోర్డ్ కు తప్పనిసరిగా అందజేయాలన్నారు. రెండో నల్లా కనెక్షన్ ఉన్న వారి విషయంలో కొంత గందరగోళం ఉండేదని, నివాసయోగ్య పత్రం (ఓసి) సమర్పించని, రెండో నల్లా కనెక్షన్ ఉన్న వారిని ఉచిత నీటి పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. మురికి వాడలు కానీ ప్రాంతాలలో బిల్లులు జారీ చేయని, ఇప్పటికే చెల్లించిన వాటర్ సెస్ ఆయా వినియోగదారులకు భవిష్యత్తులో సర్దుబాటు చేస్తారని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. 2020డిసెంబర్ నెలకు ముందు ఉన్న బకాయిలకు వడ్డీతో సహా బిల్లులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉచిత నీటి పథకం లబ్ధిదారులకు 20 వేల లీటర్ల లోపు వాడితే జిరో బిల్లు ఇస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా ఉచిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి పథకాన్ని అర్హులైన వినియోగదారులకు చేరువయ్యేలా చూసి లబ్ది పొందేలా చూడాలని, ఈ పథకం గురించి ప్రతి ఒక్కరికి విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here