శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని TG1 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతులమీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, సుప్రజా గ్రూప్స్ ఎండీ ప్రవీణ్ కుమార్, దీప్తిశ్రీ నగర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు, భాస్కర్ రావు, వెంకటేశ్వరరావు, జర్నలిస్టులు యాదగిరి, రాకేష్ కుమార్ పాల్గొన్నారు.






