శ్రీనిధి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో తెలుగు భాష దినోత్సవ, స్పోర్ట్స్ డే వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ బి బ్లాకులో శ్రీ‌నిధి స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో తెలుగు భాషా దినోత్సవం వేడుకల‌ను నిర్వ‌హించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సుధా మాట్లాడుతూ గురజాడ, గుర్రం జాషువా, శ్రీ శ్రీ, దాశరధి కృష్ణమా చార్య, రంగాచార్య, సినారె, పోత‌న‌ వంటి కవుల చిత్రపటాలు ప్రదర్శించి వారి గురించి తెలియజేశారు. గిడుగు రామ్మూర్తి గ్రాంధికంలో ఉన్న సాహిత్యాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చారని అన్నారు. తెలుగు భాష కోసం 30 సంవత్సరాల ఉద్యమం చేశారని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని, తేనె కన్నా తీయనిది తెలుగు భాష అని శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకున్నారని అన్నారు. అమ్మ నేర్పిన భాష అమ్మలాంటి తెలుగు భాషను ఎవరూ మరువకూడదని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులతో స్పోర్ట్స్ డే వేడుకలు నిర్వహించారు. పిల్లల ఎదుగుదలకు ఆటలు ఎంతో ఉపయోగపడుతాయ‌ని, చదువుతోపాటు పిల్లలకు ఆటలు ఎంతో అవసరమని అన్నారు. ఆట‌ల వ‌ల్ల‌ మానసికంగా శారీరకంగా అనేక లాభాలు క‌లుగుతాయ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here