శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పరికి చెరువు (ధరణి నగర్) నుండి ప్రేమ్ సరోవహర్ వరకు రూ.8 కోట్ల 76 లక్షలతో నూతనంగా చేపట్టబోయే నాలా విస్తరణ పనులలో భాగంగా నిర్మిస్తున్న RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను, RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం, నాలా విస్తరణ నిర్మాణం పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, SNDP విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ధరణి నగర్ కాలనీ నుండి ప్రేమ్ సరోవహర్ వరకు నాలాకు ఇరువైపుల ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుందని , తర్వాత ప్రేమ్ సరోవహర్ నుండి ఆస్బెస్టాస్ కాలనీ వరకు నాలాకు ఇరువైపుల ప్రహారి గోడ నిర్మించడం జరుగుతుందని , నాలా విస్తరణ వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అని, నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, స్థానిక కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






