శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ మేళా ముగిసింది. గత పది రోజుల నుండి శిల్పారామం లో నిర్వహిస్తున్న మేళాకు సందర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. నేహా సింగ్ శిష్య బృందం జానపద నృత్యాలతో అలరించారు. కోలాటం, బిహు, లంబాడి, ఓయిలాట్టం, ఉత్తరాఖండ్ జానపద నృత్యం, సంబల్పూరి, భాంగ్రా, కావడి చిందు అంశాలను అనన్య, గుణశ్రీ, జోషిత, హిరణ్మయి, జాహ్నవి, అముక్త, లాస్య, సంహిత, వాణి, శ్రీలత, మౌనిక, అనిత, నైనా ప్రదర్శించి మెప్పించారు.
