శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TG SWREIS) బాలికల, బాలుర పాఠశాలలో నిర్వహించిన ఎస్. ఆర్ శంకరన్ IAS 91 వ జయంతిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రిన్సిపాల్ అంజన్న, కల్పనతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకరన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శంకరన్ IAS పీపుల్స్ IAS అధికారిగా ప్రసిద్ధి చెందారని, గొప్ప అధికారి అని, గురుకుల విద్యకు పునాది వేశారు అని అన్నారు. గౌలిదొడ్డి పాఠశాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి కృషితో వేగంగా కొనసాగుతోందని అన్నారు. గౌలిదొడ్డి పాఠశాల క్రమశిక్షణకు మారుపేరు, విద్యా విలువలకు నిలయం అని అన్నారు. గౌలిదొడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ డ్రైనేజి ఔట్ లేట్ సమస్య పరిష్కారానికి రూ.1 ఒక కోటి 50 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని, అతి త్వరలోనే పనులకు శంకుస్థాపన చేసి త్వరలోనే పూర్తి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, అనిల్, వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






