శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ కైతలాపూర్ లో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కైతలాపుర్ వాసి పిల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆత్మీయ కలయిక అనే నినాదంతో అందరినీ ఒక దగ్గరికి చేర్చి అలైబలై చేసుకున్నారు. దున్నపోతుల విన్యాసాలతో వచ్చిన ప్రతి ఒక్కరిని శాలువా కండువాలతో సత్కరించారు. ఈ సదర్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా గోల్డ్ మాన్ దర్గా చిన్న గౌడ్ పాల్గొనగా, ఈ కార్యక్రమంలో మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ యాదవ్, మహేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.






