అయ్యప్పలకు అన్న సమారాధన కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అయ్యప్పలకు అన్న సమారాధన కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా నిర్వ‌హిస్తున్న‌ అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 4 వ తేదీ వరకు అన్నదానం తన ఆధ్వర్యంలో దాతల సహకారంతో జరుగుతుందని, అయ్యప్ప దీక్ష చేస్తున్న స్వాములు అందరూ అన్నదానం లో పాల్గొని ఆ అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here