శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ గీత పనివారల సంఘం శేరిలింగంపల్లి సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.రాములు హాజరై సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లిలోని పేద గౌడ్ కులస్తులకు సొసైటీ లో మెంబర్ షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని, ప్రతి ఐదు వేల జనాభాకు ఒక కల్లు దుకాణం ఏర్పాటు చేయాలని, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఈత వనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం శేరిలింగంపల్లి గీత పనివారల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షుడుగా కనకమామిడి శ్రీశైలం గౌడ్, అధ్యక్షుడుగా టీ బిక్షపతి గౌడ్, ఉపాధ్యక్షుడిగా లింగం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్, సహాయ కార్యదర్శిగా ఆర్ మల్లేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా గోవర్దన్ గౌడ్, భాస్కర్ గౌడ్, రవి గౌడ్, యాదయ్య గౌడ్, రవి గౌడ్, కోశాధికారిగా నాగేంద్ర గౌడ్, సహాయ కోశాధికారిగా సాయి కుమార్ గౌడ్, కార్యాలయ కార్యదర్శిగా బి శివకుమార్ గౌడ్ లను ఎన్నుకున్నారు.