శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఆయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రోహిత్ ముదిరాజ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా సాయి చరణ్, స్వరూప్, ప్రధాన కార్యదర్శులుగా రాజేష్, కలీం, కోశాధికారిగా భాను చందర్, జాయింట్ సెక్రటరీగా అజయ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జి.కిరణ్, సభ్యులుగా కిరణ్, చరణ్, శ్రీనులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.