శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని గుల్మోహర్ పార్క్ సర్కిల్ వద్ద ఓల్డ్ ముంబయ్ హైవేపై కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక బీసీ నాయకులతో కలిసి వాహనాల రాకపోకలు నిలిపివేసి ధర్నా నిర్వహించారు. అనంతరం గుల్మోహర్ పార్క్ సర్కిల్ నుండి లింగంపల్లి సర్కిల్ వరకు తెలంగాణ బీసీ బంద్ లో భాగంగా పాదయాత్ర చేపట్టారు. అనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ తో చందానగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా మొదలుకుని న్యూ ముంబై హైవే గుండా చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని పూలమాలలతో నివాళులర్పించారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు శేరిలింగంపల్లిలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, విద్యాసంస్థలు, వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నట్లుగా తెలిపారు. బంద్ ఫర్ జస్టిస్ ను విజయవంతం చేసిన ప్రతి బీసీ జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే అని తెలంగాణ బీసీ లకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ బీసీ జేఏసీ నాయకుడు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మినారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ రామస్వామి, సీనియర్ నాయకుడు యాదా గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సీపిఎం కార్యదర్శి శోభన్, జిల్లా సగర సంఘం అధ్యక్షుడు శేఖర్, గోపాల్ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రాంచందర్ యాదవ్, ఆర్ కే సాయన్న, రాజ్ కుమార్ ముదిరాజ్, సుధాకర్, సురేష్ రాథోడ్, గఫుర్, సయ్యద్ నయీమ్, విజయ్, గణేష్, మల్లేష్ గౌడ్, శశాంక్, పవన్, కుటుంబరావు, మహేష్ చారీ, ఆటో యూనియన్ నాయకులు వహీద్, వెజిటేబుల్ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, వినయ్, సాయి, ప్రసాద్, మహిళలు కుమారి, కళ్యాణి, లక్ష్మి, గౌసియా, ఫాతిమ, శేరిలింగంపల్లి బీసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





