కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బీసీ సమాజ అభ్యున్నతికి కట్టుబడి ఉంది: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, టీపీసీసీ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో హుడా కేఫ్ గంగారాం రాజీవ్ గాంధీ విగ్రహం నుండి చందానగర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎంబిసీ డెవలప్మెంట్ కార్పొరేటర్ చైర్మన్ జెరిపేటి జైపాల్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, పూజిత గౌడ్ పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు ఈ దేశ సామాజిక, ఆర్థిక బలానికి వెన్నెముక అని, వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించకపోతే నిజమైన సామాజిక న్యాయం సాధ్యం కాదు అని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బీసీ సమాజ అభ్యున్నతికి కట్టుబడి ఉందని అన్నారు.

బీసీ రిజర్వేషన్లను పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రంగంలో బీసీలకు సముచిత భాగస్వామ్యం ఇవ్వాలని, బీసీ రిజర్వేషన్ల పెంపు, వర్గీకరణ అమలు చేసి రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్లతో తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మద్దతు తెలిపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, రాష్ట్ర స‌గర సంఘం అధ్యక్షుడు ఉప్ప‌రి శేఖర్ సాగర్, అనిల్ కుమార్ యాదవ్, మహిపాల్ యాదవ్, లక్ష్మీనారాయణ గౌడ్, మైనారిటీ చైర్మన్ అజీమ్, డివిజన్ అధ్యక్షులు బాష్పాక యాదగిరి, మారెళ్ల శ్రీనివాస్, గిరి బాబు, ఆలీ, జహంగీర్, నగేష్ నాయక్, వీరేందర్ గౌడ్, మన్నేపల్లి సాంబశివ రావు, కట్ల శేఖర్ రెడ్డి, ఉరిటీ వెంకట్ రావు, కరుణాకర్ గౌడ్, పట్వారీ శశిధర్, యలమంచి ఉదయ్ కిరణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాకీర్, సౌందర్య రాజన్, శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, దయాకర్ యాదవ్, హరికృష్ణ, రామకృష్ణ, ప్రసాద్, సురేష్ గౌడ్, గఫూర్, డిసీసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి అభిషేక్ గౌడ్, రాంచందర్ యాదవ్, సాజిద్, ఇస్మాయిల్, నవాజ్, జావేద్, గంగల గణేష్ నాయక్, కృష్ణ గౌడ్, సంగారెడ్డి పాల్గొన్నారు.

ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, తిరుపతి, కావూరి ప్రసాద్, లక్ష్మీనారాయణ, మోహన్ రెడ్డి, ఒబీసీ హరి కిషన్, అయాజ్ ఖాన్, ప్రభాకర్, మల్లేష్, విఘ్నేశ్వర్ రెడ్డి, ధర్మ రెడ్డి, కవిరాజ్, శివ, నర్సింగ్ రావు, నర్సింహ గౌడ్, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, శ్రీదేవి, డిసిసి ఉపాధ్యక్షురాలు కల్పన ఏకాంత్ గౌడ్, మహిళా నాయకులు భాష్పక నాగమణి, లక్ష్మీ, అనిత, శశిరేఖ, శ్రీజ రెడ్డి, జయ, సావిత్రి, పద్మిని, బీసీ సంఘం నాయకులు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గం కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేబర్ సెల్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here