శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): కామారెడ్డి బి.సి డిక్లరేషన్ పేరుతో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసాధ్యమైన హామీ ఇచ్చి ప్రజలకు చేసిందేమీ లేక, ప్రజలు ఎక్కడ ఓటుతో బుద్ధి చెబుతారో అనే భయంతో సాధ్యం కాదని తెలిసినా జి.ఓ డ్రామా కు తెరలేపి, కేంద్ర ప్రభుత్వం పై కావాలని నిందలు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కపటనాటకాలకు నిరసనగా బి.సి సంఘాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. బంద్ కార్యక్రమంలో భాగంగా హెచ్.సి.యు డిపో వద్ద బీసీ సంఘం నాయకుడు శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో బస్సులను బయట పోనివ్వకుండా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి బి.సి డిక్లరేషన్ పేరుతో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసాధ్యమైన హామీ ఇచ్చి బి.సి లను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 1990 నుండి వివిధ సందర్భాల్లో రిజర్వేషన్లు 50% మించడానికి వీలులేదు అని సుప్రీం కోర్టు 8 సార్లు తీర్పు ఇచ్చిన విషయం తెలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని జి.ఓ పేరుతో డ్రామాకు తెరలేపి బి.సి లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కోర్టుకు వెళ్తే స్టే వస్తుందని తెలిసికూడా కామారెడ్డి డిక్లరేషన్ ను ఎన్నికల హామీలో చేర్చి అధికారంలోకి వచ్చాక 20 నెలలు సైలెంట్ గా ఉండి, తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాల నేపథ్యంలో హడావిడి మొదలుపెట్టి GO ఇచ్చి స్టే ఇస్తారని తెలిసి కూడా డ్రామాలు ఆడారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పై నిందలు మోపే బదులు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ లకి 42 శాతం మంత్రి పదవులు ఇచ్చి నిరూపించుకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, ఆంజనేయులు సాగర్ , తిరుపతయ్య , రమేష్, రాజు శెట్టి, హనుమంతు నాయక్ , అరవింద్ , వెంకటేశ్వర్లు రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.






