శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతు తెలుపుతూ చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతం ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతం మాట్లాడుతూ నవీన్ యాదవ్ ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉంటూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపే నాయకుడని, ఆయన ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే సదాశయత కలిగిన అభ్యర్థి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు గత కొంతకాలంగా స్పష్టమైన అభివృద్ధిని చూసి సంతోషంగా ఉన్నారని, రేవంత్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి వర్గాన్నీ ఆకర్షిస్తున్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ పాలన అత్యవసరం అని, అందువల్ల నవీన్ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రాంతాభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఓటరు కోరుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ ప్రచార కార్యక్రమంలో మిర్యాల రాఘవరావు, దాసరి గంగారావు, జగన్నాధ రావు, శ్యామలా రావు, సుబ్రహ్మణ్యం, పరదేశి నాయుడు, ప్రసాద్, విఠల్, సాయి, టిల్లు తదితరులు పాల్గొన్నారు.






