శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కురపతి అరుణ బాయి (రికార్డు అసిస్టెంట్) ఉద్యోగ విరమణ అభినందన సభ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణ బాయిని సత్కరించి మెమెంటో బహుకరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రికార్డు అసిస్టెంట్ గా పాఠశాలకు, అనేకమంది విద్యార్థుల భవితకు బాటలు వేసిన అరుణ బాయి గుర్తుండిపోతారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం సమాజ హితానికి తన అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్ర రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నబీబ్ బునిస్స, పి.ఆర్.టి.యు టి.ఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్ మహేందర్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, సురభి కాలనీ ఎంపిపిఎస్ హెచ్ఎం పాండురంగా రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కృష్ణ రెడ్డి, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ ఉదయ కుమారి, కరుణ, దుర్గా భవాని, సూర్యప్రభ, వీరేశం, సురభి కాలనీ ఎంపీపీఎస్ మాజీ ఎస్ఎంసి బస్వరాజ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, అర్జునయ్య, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.





