ప్రపంచ HIV/AIDS దినోత్సవ అవగాహన కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ లేపాక్షి జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు HIV/AIDS వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మిఅధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన G. గురుప్రకాష్ (విశ్రాంత Deputy పారా మెడికల్ ఆఫీసర్‌, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ) విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి భయంకరమైన వ్యాధులలో HIV ఒకటి అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడి ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న గురుప్ర‌కాష్

దీనితో ఆర్థిక నష్టముతోపాటు అకాల మృత్యువు బారిన పడుతున్నారు. నష్ట నివారణకైన ప్రపంచ ఆరోగ్య సంస్థవారు ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 1వ తేదీన‌ ఈ వ్యాధి వలన కలిగే అనర్థాలు, ఈ వ్యాధి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.. అని అన్నారు. AIDS రహిత సమాజానికై ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వంతోపాటు పౌర సమాజం కూడా కృషి చేయాల‌ని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులచేత AIDS రహిత సమాజానికై కృషి చేస్తాము అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్న విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here