స్టాలిన్ నగర్ అంగన్‌వాడీకి గ్యాస్ కుక్కర్, నిత్యావసర వస్తువుల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): స్టాలిన్ నగర్ అంగన్‌వాడీ కేంద్రానికి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అట్టేపల్లి రామప్రభు పటేల్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రానికి అవసరమైన గ్యాస్ కుక్కర్‌తోపాటు ఇతర సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రానికి అవసరమైన రేకులు కూడా వేయిస్తామని అట్టేపల్లి రామప్రభు పటేల్ హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ శ్రీదేవి, స్టాలిన్ నగర్ కాలనీకి చెందిన సాయి, శ్రీను, రాజు, ప్రదీప్, ఎం.ఏ. నగర్ కాలనీకి చెందిన అనిల్, శేఖర్, నరసింహులు, హనుమంతు తదితరులు, అలాగే ARP టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here