ఘనంగా శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ భవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ప్రశాంతి నగర్ లోని శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ భవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాన‌ని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయ‌ని అన్నారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ అశోక్, మురుగేష్, శ్రీనివాస్, సత్తి కుమార్, గోపాల్, ప్రణేష్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజకుమార్, సుధాకర్ రెడ్డి, కృష్ణ స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు. సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here