శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట్ డివిజన్ హుడా కాలనీలో హర్ ఘర్ తిరంగా అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హర్ ఘర్ తిరంగా కన్వీనర్ డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి మాట్లాడుతూ ఆగస్టు 10 నుంచి 15 వరకు నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి బూత్, ప్రతి ఇంటి వరకు విజయవంతంగా తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. డివిజన్ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు పూర్తి బాధ్యతతో కార్యక్రమాలను నిర్వహించాలని పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు దేవాల్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు రవి గౌడ్, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆళ్ల వరప్రసాద్, సీనియర్ నాయకురాలు పార్వతి, నాయకులు పవన్, హఫీజ్‌పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మారేళ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ప్రసాద్ పాత్రో, రాజు యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల, కార్యదర్శులు చుక్క శ్రీను, సుబ్బారావు, బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, నాయకులు మోహన్ ముదిరాజ్, నవీన్, రామచంద్ర యాదవ్, శేఖర్ ముదిరాజ్, రాంరెడ్డి, అశోక్ ముదిరాజ్, స్వామి, సాయి నాయక్‌తోపాటు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.





