తారాన‌గ‌ర్ రెహాన్ జ్యువేల‌రీలో భారీ చోరి… 15 తులాల బంగారం, 15 కిలోల వెండి, రూ.3.5 ల‌క్ష‌ల న‌గదు మాయం…

న‌మ‌స్తే శేరిలింగ‌పల్లి: ఒక‌వైపు క‌రోనా విజృంభ‌న‌తో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతుంటే మ‌రోవైపు దొంగ‌లు వారిప‌నిలో దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఓ జ్యువేల‌రీ షాపు ష‌ట్ట‌ర్ తొల‌గించిన దుండ‌గులు పెద్ద‌మొత్తంలో బంగారం, వెండి, న‌గ‌దు దోచుకెళ్లిపోయారు. ఎస్ఐ అహ్మ‌ద్ పాషా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… తారాన‌గ‌ర్ తుల్జాభ‌వానీ గుడి స‌మీపంలోని రెహాన్ జ్యువేల‌రీ షాప్ య‌జ‌మాని స‌య్య‌ద్ ప‌ర్వీన్‌ ఎప్పిటిలాగే శ‌నివారం రాత్రి 8 గంట‌ల ప్రాంతంలో షెట్ట‌ర్ లాక్ చేసి వెళ్లింది. ఆదివారం ఉద‌యం 9.30 గంట‌ల ప్రాంతంలో తిరిగి షాప్ తెరిచేందుకు రాగా అప్ప‌టికే షెట్ట‌ర్ తొల‌గించి ఉంది. దీంతో లోప‌లికి వెళ్లి చూడ‌గా 15 తులాల బంగారం, 15 కిలోల వెండి, రూ.3.5 ల‌క్ష‌ల న‌గ‌దు దోచుకెళ్లిన‌ట్టు గుర్తించింది. దింతో చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌కు స‌మాచారం అందించ‌గా రంగంలోకి దిగిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ‌ప్ర‌సాద్‌, మియాపూర్ డీఐ మ‌హేష్ గౌడ్‌, స్తానిక ఎస్ఐలు అహ్మ‌ద్‌పాషా, వెంక‌టేష్‌లు ఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. కాగా చోరికి గురైన సొత్తు విలువ దాదాపూ రూ.23 ల‌క్ష‌లు ఉంటుంద‌ని బాదితురాలు ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

రేహాన్ జ్యువేల‌రీ వ‌ద్ద ప‌రిస్థితుల‌ను ఆరా తీస్తున్న మియాపూర్ ఏసీపీ కృష్ణ‌ప్ర‌సాద్ బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here