నమస్తే శేరిలింగంపల్లి: తారానగర్‌లోని విద్యానికేతన్ స్కూల్‌లో సేవాభారతి శేరిలింగంపల్లి ఆద్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. దాదాపు 60 మంది శిబిరంలో పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ ఆఫ్‌సర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కేఎస్ రవి, చందానగర్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐలు వెంకటేష్, అహ్మద్ పాషాలు ముఖ్య అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సేవాభారతి ప్రాంత ఉపాధ్యక్షులు రామ్మూర్తి మాట్లాడుతూ ఓకవైపు కరోనా రెండవ దశ ఉదృతి కొనసాగుతుండటం… మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కొంత కాలం రక్తదానం చేయలేని పరిస్థితుల నేపథ్యంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు పడిపోతున్నాయని అన్నారు.
ఈ క్రమంలో తరచూ రక్తం అవసరం పడే తలసేమియా లాంటి రోగులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసర పడే రోగులను దృష్టిలో ఉంచుకుని ప్రాంతాల వారిగా సేవాభారతి ఆద్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా పరిస్థితులు రోజురోజుకి గంభీరంగా మారుతున్నప్పటికీ దాతలు విశేష స్థాయిలో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి శేరిలింగంపల్లి ఇన్చార్జీ గజ్జల యోగానంద్, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జ్ఞనేంద్రప్రసాద్, నందకుమార్ యాదవ్, జిల్లా నాయకులు చింతకింది గోవర్ధన్‌గౌడ్, పోరెడ్డి బుచ్చిరెడ్డి, డివిజన్ నాయకులు రాజుశెట్టి, రాంరెడ్డి, సత్యకురుమ, మహేష్ గౌడ్, ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ్ లక్ష్మీనారాయణ, సహవిభాగగ్ ప్రచారక్ జగన్నాథ్, కార్యకర్తలు పాల్గొని దాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.