నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలోని పారిశుధ్య పనుల నిర్వహణపై ఏఎంఓహెచ్ డాక్టర్ కార్తీక్‌తో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ఆదివారం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కోవిడ్ బారిన పడిన ప్రజలు పడుతున్న అవస్థలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, చందానగర్ సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్ల లోని ప్రతి కాలనీలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వర్తించేలా చూడలని, కరోన వ్యాధి విస్తరణ నేపథ్యంలో ప్రజా ఆరోగ్య దృష్ట్యా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కాలనీ లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, పేరుకుపోయిన చెత్త చెదారం లను వెంటనే తొలగించాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండలని, పారిశుధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం లేకుండా చూడలని, డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి సహకారం తీసుకుని సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి కానీలలో విరివిగా పిచికారి చేయించాలని సూచించారు.