శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవాపక్షంలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని రాయదుర్గంలో నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెయింటింగ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివసింగ్, మీన్ లాల్ సింగ్, స్వామి గౌడ్, నరేందర్ గౌడ్ , అశోక్, దయాకర్, సంజీవ, నరేందర్ యాదవ్ పాల్గొన్నారు.






