శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడలోని జెనెసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇన్వెస్టిచర్ సెరిమనీని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్నల్, కమాండింగ్ ఆఫీసర్ అరవింద్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరుణ్ కుమార్, నందిత ప్రకాష్, పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ జైపాల్, డైరెక్టర్లు అనన్య, అవినాష్, ప్రిన్సిపాల్ నళిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ జైపాల్ మాట్లాడుతూ ఇన్వెస్టిచర్ సెరిమనీ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే కీలక కార్యక్రమమని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికైన విద్యార్థి నాయకులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పాఠశాల ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులను వేదికపైకి ఆహ్వానించి బ్యాడ్జీలు, సాష్లను ప్రదానం చేసి బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులు నాయకత్వం, క్రమశిక్షణ, సేవాభావంతో విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ప్రతినిధులు రాజీవ్, గీతా జోసెఫ్, రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.






