శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ లోని స్కాలర్స్ నెస్ట్ గ్లోబల్ స్కూల్, తుషార్ ప్లే స్కుల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి..ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అందరిని అలరించాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని సూచించారు. విద్యార్థులకు బాల్యం నుంచే నాణ్యమైన విద్యను అందించాలని వారిలో దైర్యం ఆత్మవిశ్వాసం పెరిగేలా భోదనలు ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.