శంక‌ర్ న‌గ‌ర్ కాల‌నీ అభివృద్ధికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయ‌న‌ నివాసంలో మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి, అభినందించారు. శంకర్ నగర్ కాలనీ అభివృద్ధికి, పార్క్ అభివృద్ధి పనులకు 1రూ.0,00,000, సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు రూ. 5,00,000 వ్యయంతో ఎమ్మెల్యే DF FUNDS ద్వారా పార్క్ అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటుకై నిధుల మంజూరి కొరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరు పత్రాలను శంకర్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.

ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శంకర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. SDF నిధుల ద్వారా పార్క్ అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటుకై నిధుల మంజూరికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరి పత్రాలను కాలనీ అసోసియేషన్ సభ్యులకు అందచేయడం జరిగింద‌ని, శంకర్ నగర్ కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, శంకర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడు కె. ప్రవీణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ PT చౌదరి, జనరల్ సెక్రెటరీ వి కృష్ణ మూర్తి, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ , సురేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు CH. కృష్ణమూర్తి, శ్రీనివాస్, కోశాధికారి CH మల్లికార్జున రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here