శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీలో స్థానిక నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం కావొద్దని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ.. మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్ పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ తన సొంత ఖర్చులతో నిర్మించిన ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో దాతలు కమ్యూనిటీ ప్యూర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైయర్ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటుకు కృష చేసిన కమ్యూనిటీ ప్యూర్ వాటర్ చందు సంస్థ ను అభినందించారు. విద్యార్థులకు శుద్ధమైన, సురక్షితమైన మంచినీటిని అందించాలని కార్పొరేటర్ సూచించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా వాటర్ బాటిల్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, కమ్యూనిటీ ప్యూర్ వాటర్ మేనేజర్ రమేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మెన్ శ్రీకళ, హెచ్ఎం పాండురంగా రెడ్డి, మాజీ ఎస్ఎంసీ ఛైర్మన్ బస్వారాజ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆశ్రఫ్, మౌనిక, మల్లికాంబ, మహేశ్వరీ, వనిత, విజయ, మాధవి, పూజిత, చాముండేశ్వరి, సురభి కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కోదండరాం, శేఖర్, స్థానిక మహిళలు భాగ్యలక్ష్మి, సౌజన్య, కుమారి, కళ్యాణి, గౌసియా, ఫాతిమ, లక్ష్మి, సబియా, దీప, కుటుంబరావు, మహేందర్, సూర్య తదితరులు పాల్గొన్నారు.





