చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలో హుడా కాలనీకి చెందిన హిమజ రెడ్డి అనే విద్యార్థినికి రూ.10వేల సహాయం అందజేశారు. చదువుల్లో రాణిస్తున్న ఆమెకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ అధ్యక్షుడు కొండా విజయకుమార్ ఆదివారం రూ.10వేలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ప్రతినిధులు తోపుగొండ మహిపాల్ రెడ్డి, మారం వెంకట్, శాంతి భూషణ్ రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, సందీప్, మారం ప్రసాద్ పాల్గొన్నారు.






