శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని 11కేవీ రైల్ విహార్ ఫీడర్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు తారానగర్ ఆపరేషన్స్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బృందావన్ హోటల్ ఏరియా, లింగంపల్లి రైల్వే ట్రాక్, గాంధీ ఎస్టేట్, రంగప్రసాద్ అపార్ట్మెంట్, రైల్ విహార్, వెంకట్ రెడ్డి కాలనీలలో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హుడా ట్రేడ్ సెంటర్, ఓల్డ్ లింగంపల్లి, లింగంపల్లి మార్కెట్ ఏరియా, రామయ్య కాలనీల్లో కరెంటు ఉండదని తెలిపారు.





