ఆల‌యాల అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కృషి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతూ నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. నల్లగండ్ల గ్రామ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకరోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి, నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. నల్లగండ్ల గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం గ్రామస్థులకు భక్తి, శ్రద్ధా కేంద్రంగా ఉందని, ఆలయ అభివృద్ధి కోసం నూతన దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, భక్తుల సేవలో అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఆల‌య క‌మిటీ చైర్మ‌న్‌గా పురం విజేంద‌ర్ రెడ్డి, డైరెక్ట‌ర్లుగా శోభ, పి.లక్ష్మీ నారాయణ, ఎం శ్రీనివాస్, డి.దయానంద, పి.రమేష్ యాదవ్, టి.శివ కుమార్ గౌడ్ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ప్రధాన అర్చకులు సాంగమేశ్వర్, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి వారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు దశరథ్, దయాకర్ యాదవ్, వెంకట్ రెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, యాదగిరి, మల్లేష్, కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింహ రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here