శ్రీచంద‌న డాక్ట‌ర్ ప్ర‌వీణ్‌కు మ‌హిళ సేన సేవా స‌మితి ఉగాది విశిష్ట పుర‌స్కారం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌ముఖ న్యూట్రీష‌నిస్ట్‌, సంఘ సేవ‌కురాలు శ్రీచంద‌న డాక్ట‌ర్ ప్ర‌వీణ్‌కు విశిష్ట పుర‌స్కారం ద‌క్కింది. మ‌హిళ సేన సేవ స‌మితి ఆద్వ‌ర్యంలో ప్ర‌క‌టించిన ఉగాది పుర‌స్కార‌లలో శ్రీచంద‌న‌కు అవ‌కాశం ద‌క్కింది. స‌మాజంలో నిస్వార్ధంగా సేవ‌లందిస్తున్న ప్ర‌ముఖుల‌కు మ‌హిళ సేన సేవా స‌మితి పురస్క‌ర‌ల‌ను ప్ర‌క‌టిస్తు వ‌స్తుంది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది సంఘ సేవ‌కురాలిగా, న్యూట్రిష‌నిస్ట్‌గా, హాస్పిట‌ల్ అడ్మినిస్టేట‌ర్‌గా, సినీ నిర్మాత‌గా ఇలా అనేక రంగాల్లో విశిష్ట సేవ‌లందిస్తున్న శ్రీచంద‌న‌కు ఉగాది పుర‌స్క‌రాన్ని అంద‌జేశారు.

శ్రీచంద‌నను‌ స‌త్క‌రిస్తున్నడాక్ట‌ర్ ప‌ద్మిని నాగుల‌ప‌ల్లి, సంధ్యాల‌క్ష్మి, డాక్ట‌ర్ పూజా చౌద‌రి, విజ‌య్‌కుమార్‌లు

ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన ఈ మ‌హోత్స‌వంలో ఫిల్మ్‌చాంబ‌ర్ ఎక్జీక్యూటీవ్ క‌మిటి స‌భ్యులు డాక్ట‌ర్ ప‌ద్మిని నాగుల‌ప‌ల్లి, స‌మితి వ్య‌వ‌స్థాప‌కురాలు సంధ్యాల‌క్ష్మి, ప్ర‌ముఖ సైకాల‌జిస్ట్ డాక్ట‌ర్‌ పూజా చౌద‌రి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యులు విజ‌య్‌కుమార్‌, బెగంపేట్ డివిజ‌న్ అధ్య‌క్షుడు మిథున్ జైన్‌లు శ్రీచంద‌న్‌కు ఉగాది పుర‌స్కారాన్ని అంద‌జేసి, ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ త‌న సేవ‌ల‌ను గుర్తించి విశిష్ట పుర‌స్క‌రాన్ని అంద‌జేసిన మ‌హిళ సేన సేవ స‌మితి వ్య‌వ‌స్థాప‌కురాలు సంధ్యాల‌క్ష్మికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇదే స్పూర్తితే త‌న సేవాకార్యామాల‌ను మ‌రింత విస్తృతం చేస్తాన‌న శ్రీచంద‌న తెలిపారు. ఈకార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖులు హిమాజా, సాహితి, కోటేశ్వరి, శ్రీనివాసరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here