నమస్తే శేరిలింగంపల్లి: రోజులాగే పనికోసం వెళ్తున్నాని చెప్పి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్ర లాతూర్ జిల్లా సోమ్‌నాత్‌పూర్‌లోని సంజయ్‌నగర్ ప్రాంతానికి చెందిన సతీష్ మణి(29), నీలమ్మ మణి దంపతులు తమ కొడుకుతో సహ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి చందానగర్ పీఎస్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 33 ఫ్లాట్ నెంబర్1లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా టైల్స్ పని చేసే సతీష్ మణి రోజు లాగే గతేడాది అక్టోబర్ 21న ఇంటినుంచి పనికోసం వెళ్లి తిరిగి రాలేడు. అతని ఫోన్ నెంబర్ స్విచ్ఛాఫ్ వస్తుంది. దీంతో భార్య నీలమ్మ స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు, స్వస్థంలోనూ ఆరాతీసిన సతీష్ జాడ తెలియక పోవడంతో శనివారం చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ ఆచూకీ తెలిసిన వారు ఫోన్ నెంబర్ 9490617246, 8332981141లలో సమాచారం అందించాలని ఎస్ఐ రాములు సూచించారు.