శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శారదా హైస్కూల్‌లో నిర్వహించిన స్వామి శ్రీవివేకానంద జయంతి కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి గంగల రాధాకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. స్వామి వివేకానంద చిత్రానికి పూలమాల అర్పించి,ఆయన వైభవాన్ని స్మరించుకున్నారు. విద్యార్థులతో నేరుగా చర్చిస్తూ వారిలో ఆధ్యాత్మిక చైతన్యం, సేవా భావం మరింత బలపడాలని గంగాల రాధాకృష్ణ యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శారద హై స్కూల్ ప్రిన్సిపాల్ నరేంద్ర నాథ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ కార్యక్రమంలో కూడా పాల్గొని,వారి ఉత్సాహం, ఏకతా భావం, సామూహిక బాధ్యతను ప్రశంసనీయంగా పరిశీలించారు. అలాగే స్వామి వివేకానంద గురించి కొన్ని ప్రేరణాత్మక మాటలు కూడా విద్యార్థులకు చెప్పారు. ఆయన ఆధ్యాత్మికత, సేవా భావం, స్ఫూర్తిదాయక జీవితం గురించి అవగాహన పెంపొందించారు.






