శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులతో రహదారులపై రద్దీ ఏర్పడనున్న దృష్ట్యా స్థానిక వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ కారణంగా శేరిలింగంపల్లిలోని మియాపూర్ ఎక్స్ రోడ్డుతోపాటు కేపీహెచ్‌బీ, మూసాపేట నుంచి భారీ ఎత్తున ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్ బస్సుల ద్వారా ప్రయాణించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. కనుక స్థానికులు, తోటి ప్రయాణికులు వేరే మార్గాలను అనుసరించాలని సూచించారు. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆయా మార్గాల్లో వెళ్లకపోవడమే మంచిదని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలను సాగించాలని అన్నారు.





