శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సప్తమ(7వ) వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సప్తమ(7వ) వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి వారి కృప ప్రజలందరిపై ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మంత్రి ప్రగడ సత్యనారాయణ, టీఎన్జీవో కాలనీ వాసులు సుధాకర్, కారెం రవీందర్ రెడ్డి, బాలయ్య, మన్మోహన్, నారాయణ, కృష్ణ రెడ్డి, ఉమాదేవి, సురేష్ నాయక్, నగేష్, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






