సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో శేరిలింగంప‌ల్లి అభివృద్ధి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి NH65 శ్రీదేవి థియేటర్ రోడ్డు నుండి అమీన్ పూర్ వరకు రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే 2.7 KM పొడవు ఉన్న‌ 4 లేన్ రహదారి విస్తరణ, 2 లేన్ సర్వీస్ రహదారి విస్తరణ పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీదేవి థియేటర్ రోడ్డు నుండి అమీన్ పూర్ వరకు రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే 2.7 KM పొడవు ఉన్న రహదారి విస్తరణ పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. పనులలో వేగం పెంచాలని, త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1650 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింద‌ని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్ట్స్ అధికారులు DE హరీష్ బాబు, AE శివ కృష్ణ యాదవ్, AE సౌమ్య, టౌన్ ప్లానింగ్ ACP నాగిరెడ్డి, TPS రోహన్, నాయకులు సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here