శేరిలింగంపల్లి, నవంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కాలనీకి చెందిన మదపతి దివ్య అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.2,75,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF LOC మంజూరు పత్రాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బ్రిక్ శ్రీనివాస్, అనిల్ కావూరి, జిల్లా గణేష్, ఎల్లం నాయుడు, శివసాగర్ తదితరులు పాల్గొన్నారు.






