శ్రీ రామ ‌జ‌న్మ‌భూమి తీర్థ కేత్ర నిధి స‌మ‌ర్ప‌ణ్‌‌కు పెరుగుతున్న‌ స్పంద‌న‌

  • రూ.1.11 ల‌క్ష‌లు స‌మ‌ర్పించిన అందెల కుమార్ యాద‌వ్‌
  • రూ.1 ల‌క్ష అంద‌జేసిన మూల ర‌మేష్ గౌడ్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శ‌్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర నిధి స‌మ‌ర్ప‌ణ్‌‌కు స్పంద‌న పెరుగుతుంది. ఈ క్ర‌మంలోనే అఖిల భార‌త యాద‌వ మ‌హాస‌భ రంగారెడ్డి జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు, బిజెపి స్థానిక నాయ‌కుడు అందెల కుమార్ యాద‌వ్ రూ.1.11 ల‌క్ష‌ల చెక్కును ఆర్ఎస్ఎస్ తెలంగాణ స‌హ ‌ప్రాంత ప్ర‌చార‌క్ లింగం శ్రీధ‌ర్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ వైస్ చైర్మ‌న్ నంద‌కుమార్ యాద‌వ్‌ల‌కు అంద‌జేశారు. అదేవిధంగా శేరిలింగంప‌ల్లి ప్ర‌ముఖ ఎక్సైజ్ కాంట్రాక్ట‌ర్ మూల ర‌మేష్ గౌడ్ రూ.1 ల‌క్ష చెక్కును బిజెపి రంగారెడ్డి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌కు అంద‌జేశారు. రామ‌కార్యంలో భాగ‌స్వాములైన కుమార్ యాద‌వ్‌, ర‌మేష్ గౌడ్‌ల‌ను రామ‌సేవ‌కులు అభినందించారు.

లింగం శ్రీధ‌ర్, నంద‌కుమార్ యాద‌వ్‌ల‌కు రూ.1.11 చెక్కును అంద‌జేస్తున్న అందెల కుమార్ యాద‌వ్‌
చిత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌కు రూ.1 ల‌క్ష చెక్కును అంద‌జేస్తున్న మూల ర‌మేష్ గౌడ్‌

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here