నమస్తే శేరిలింగంపల్లి: ఖాదీ ఆండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) ఆలిండియా సభ్యులు, సౌత్ ఇండియా జోన్ చైర్మన్ పేరాల శేఖర్ రావును ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రాఘవేందర్ రావులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరానికి వచ్చిన పేరాల శేఖర్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమని, రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.






