శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ స్ప్రింగ్ విల్లాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర సీతారామలక్ష్మణ ఆంజనేయ శివనందీశ్వర గణపతి సుబ్రమణ్య సాయినాథ దేవాలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.