శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రథమ కుమారుడు రాగం అనిరుధ్ యాదవ్, పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కుమార్తె జాగృతి సాయిల వివాహం ఇటీవల జరిగిన సందర్భంగా ఇరు కుటుంబాల సభ్యులు తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి (యాదగిరిగుట్ట) శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని నూతన వధూవరులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం కొమురవెల్లిలోని మల్లన్న స్వామి వారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని నూతన వధూవరులకు స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.